The latest entrant into Congress, A Revanth Reddy , will take up a campaign against KCR and family rule either from Kodangal, the assembly constituency he represented, or Chevella. <br />కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేవెళ్ల నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కావొచ్చుననే ప్రచారం సాగుతోంది. <br />చేవెళ్లలో రేవంత్‌కు మంచి ఫాలోయింగ్ ఉందని, వారంతా ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించాలని కోరుతున్నారని తెలుస్తోంది. మరోవైపు, రేవంత్ మంగళవారం మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణను కలిశారు. <br />సర్వే సత్యనారాయణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఆయన నివాసం వద్ద మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు.